Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి: భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

US Urges India To Utilize Ties With Russia Tell Putin To End Ukraine War
Advertisement
  • భారత్-రష్యా సంబంధం సుదీర్ఘమైనదన్న అమెరికా
  • ఈ సంబంధాన్ని యుద్ధానికి ముగింపు పలికేలా ఉపయోగించాలని విన్నపం
  • ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు చెప్పాలని అమెరికా విజ్ఞప్తి
Advertisement
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని కోరింది. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో మాస్కో కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ చార్టర్‌ను గౌరవించాలని పుతిన్‌కు చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement
India
Narendra Modi
USA
Russia
Ukraine

More Telugu News